saitej: ఇకపై రీమిక్స్ లు చేయనంటున్న సాయితేజ్

Saitej
  • మాస్ ఇమేజ్ కోరుకున్న సాయితేజ్ 
  • రీమిక్స్ ల వలన వచ్చిన విమర్శలు 
  •  త్వరలో రానున్న 'సోలో బ్రతుకే సో బెటర్'
సాయితేజ్ ను తొలిసారిగా తెరపై చూడగానే చిరంజీవి పోలికలు వున్నాయనుకున్నారు. సాయితేజ్ కూడా చిరంజీవి మాదిరిగానే మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని అడుగు ముందుకేశాడు. బాడీ లాంగ్వేజ్ విషయంలోను .. డైలాగ్ డెలివరీ విషయంలోను చిరంజీవినే అనుకరిస్తున్నట్టు చెప్పుకున్నారు. దానికి తోడు చిరంజీవి కెరియర్లో సూపర్ హిట్ అనిపించుకున్న పాటలను తన సినిమాల్లో రీమిక్స్ చేస్తూ వచ్చాడు.

సాయితేజ్ అలా చేయడం పట్ల కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా సాయితేజ్ మాట్లాడుతూ, ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ సాంగులు ఉండకుండా చూసుకుంటానని చెప్పాడు. ఈ విషయంపై దర్శక నిర్మాతలు వత్తిడి చేసినా, తాను మాత్రం రీమిక్స్ లు చేయనని తేల్చిచెప్పాడు. త్వరలో 'సోలో బ్రతుకే సో బెటర్' ద్వారా ప్రేక్షకులను పలకరించనున్న ఆయన, ఆ తరువాత దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు.
saitej
Solo Brathuke So Better Movie
Tollywood

More Telugu News