తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు: మహేశ్ బాబు

09-04-2020 Thu 11:30
  • లాక్ డౌన్ సమయంలో కష్టపడి పని చేస్తున్నారు
  • కరోనాపై యుద్ధంలో నిస్వార్థంగా పని చేస్తున్నారు
  • మన కుటుంబాల సంరక్షణ కోసం పాటుపడుతున్నారు
Mahesh Babu salutes Telangana police

లాక్ డౌన్ సమయంలో తెలంగాణ పోలీసులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని స్టార్ హీరో మహేశ్ బాబు కితాబిచ్చాడు. కరోనాపై యుద్ధంలో వారు చేస్తున్న సేవలను మనస్పూర్తిగా ప్రశంసిస్తున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో మన కుటుంబాల సంరక్షణ కోసం వారు ఎంతో పాటుపడుతున్నారని... దేశం కోసం, దేశ ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్న పోలీసులకు శాల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు. దీంతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫొటోలు షేర్ చేశాడు.