అమెరికాలోని సూపర్ మార్కెట్ లో నిత్యావసర వస్తువులను నాకిన మహిళ... అరెస్ట్!

09-04-2020 Thu 11:15
  • యూఎస్ లోని కాలిఫోర్నియాలో ఘటన
  • నాకిన నిత్యావసరాలను నాశనం చేసిన స్టోర్
  • అదుపులోకి తీసుకున్న నెవెడా పోలీసులు
Women Arrested for Licking Groceries

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ చేసిన అసభ్యకరమైన పని, ఆమెనిప్పుడు కటకటాల్లోకి నెట్టింది. ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లిన ఆమె, రూ. 1.35 లక్షల (సుమారు 1,800 డాలర్లు) విలువైన నిత్యావసరాలు, ఇతర వస్తువులను నాకేసి, వెళ్లిపోయింది. ఈ విషయాన్ని సీసీటీవీ కెమెరాల్లో పరిశీలించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నెవెడా సరిహద్దుల్లోని సేఫ్ వే స్టోర్ లో మంగళవారం ఈ ఘటన జరిగిందని, ఓ కస్టమర్ గ్రోసరీలను నాకేసి వెళ్లిపోయినట్టుగా ఫిర్యాదు అందిందని, సౌత్ లేక్ తహోయ్ పోలీస్ విభాగం ప్రతినిధి క్రిస్ ఫ్లోరీ వెల్లడించారు. ఆమె స్టోర్ లోని ఆభరణాలను కూడా నాకిందని, ఆమెను షాపులోనే గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆమె పేరు జెన్నీఫర్ వాకర్ అని గుర్తించినట్టు వెల్లడించారు. ఆమె నాకిన నిత్యావసరాలన్నింటినీ నాశనం చేసినట్టు స్టోర్ నిర్వాహకులు వెల్లడించారు.