గత 12 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా రాలేదన్న ఏపీ ప్రభుత్వం!

09-04-2020 Thu 10:58
  • రాత్రి 9 నుంచి ఉదయం వరకూ 217 రక్త పరీక్షలు
  • ఒక్క పాజిటివ్ కూడా రాలేదన్న ప్రభుత్వం
  • మొత్తం 348 కరోనా కేసులు
No Corona Positive in AP in Last 12 Hours

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకూ జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

" రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈ రోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో  217 శాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసులు నెగటివ్ గా నిర్ధారించబడ్డాయి" అని అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఏపీలో 348 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 9 మందికి చికిత్స అనంతరం కరోనా నెగటివ్ రావడంతో, డిశ్చార్జ్ అయ్యారు.