Manorama: మద్యం లభించక.. నిద్రమాత్రలు మింగి ఆసుపత్రి పాలైన సినీనటి మనోరమ కుమారుడు!

Actress Manorama Son Hospitalised agter Taking Sleeping Pills Over Dose
  • నిత్యమూ మద్యం తాగే అలవాటున్న భూపతి
  • లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం లభించక అవస్థలు
  • మత్తు కోసమే నిద్రమాత్రలు వేసుకున్నారన్న కుమారుడు రామరాజన్
ఎన్నో భాషల్లో వేలాది చిత్రాల్లో నటించిన దక్షిణాది సినీ నటి దివంగత మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు అతిగా వేసుకుని, ఆసుపత్రి పాలు కావడం చెన్నైలోని టీ-నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి నీలకంఠ మెహతా స్ట్రీట్ లో కుటుంబ సభ్యులతో కలసి నివసిస్తున్న భూపతికి నిత్యమూ మద్యం తాగే అలవాటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలవుతున్న కారణంగా మద్యం దుకాణాలు మూతపడగా, భూపతి నిద్రమాత్రలు మింగాడు.

దీంతో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తొలుత వార్తలు వచ్చాయి. భూపతి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబీకులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చిన భూపతి కుమారుడు రాజరాజన్‌, తన తండ్రిని హాస్పిటల్ లో చేర్చిన విషయం నిజమేనని స్పష్టం చేశారు. మద్యం తాగే అలవాటున్న ఆయన, మత్తు కోసమే నిద్ర మాత్రలు వేసుకున్నారని, ఆయనేమీ ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు.
Manorama
Bhupati
Sleeping Pills
Liquor
Lockdown

More Telugu News