Vizianagaram: షేర్ మార్కెట్ లో నష్టాలు.. మనస్తాపంతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

Bank Employee suicide in Vizianagaram as share market collapse
  • విజయనగరంలోని బలిజపేటలో ఘటన
  • షేర్‌మార్కెట్ కుప్పకూలడంతో రూ. 20 లక్షల నష్టం
  • తల్లికి రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు
షేర్‌మార్కెట్ కుప్పకూలడంతో తీవ్రంగా నష్టపోయిన ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా బలిజపేటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఆర్య జిల్లాకు చెందిన అజయ్‌బాబు (27) స్థానిక బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

షేర్‌మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మార్కెట్ కుదేలవడంతో, అజయ్‌బాబు రూ. 20 లక్షల మేర నష్టపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తల్లికి రాసిన లేఖను అతడి పర్సు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Vizianagaram
Share Market
Bank employee
suicide

More Telugu News