ఏపీలో 348కి పెరిగిన కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య

08-04-2020 Wed 20:49
  • 24 గంటల్లో 19 కేసుల నమోదు
  • గుంటూరులో అత్యధికంగా 8 కేసులు నమోదు
  • విశాఖలో కోలుకున్న ముగ్గురు డిశ్చార్జ్
Corona cases raised to 348 in AP

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు కొత్తగా మరో 19 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 348కి చేరింది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు అంటే 24 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో 34 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశంలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, విశాఖపట్టణంలో కరోనా బారి నుంచి కోలుకున్న ముగ్గురిని డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొంది. వీరితో కలిపి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9కి పెరిగింది.