రిలీజ్ కు నోచుకోని పాత సినిమాలో ఐశ్వర్యారాయ్ డ్యాన్స్ పై నెటిజన్ల క్రియేటివిటీ ఇలా!

08-04-2020 Wed 19:53
  • 1997కు చెందిన విడుదలకు నోచుకోని చిత్రం రాధేశ్యామ్ సీతారామ్
  • ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్యారాయ్ 
  • ఆ సినిమా సెట్స్ లో ఆమె డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్లు
  • ఆ డ్యాన్స్ కు ‘దిల్ కా రిస్తా’ లో పాట మిక్స్ చేసిన వైనం
Aishwarya rai unreleased movie Radheshyaam sitaram

ఎంతటి గొప్ప నటీనటులకైనా వారు నటించిన చిత్రాల్లో విడుదలకు నోచుకోనివి ఒకటో, రెండో ఉంటాయి. ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆగిపోయిన తమ అభిమాన నటో, నటుడో నటించిన చిత్రాల గురించి గుర్తు చేసుకునే వారు, ఆరా తీసేవారు ఉంటూనే ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపుగా అందరూ తమ ఇళ్లకే పరిమితం కావడంతో ఎవరి వ్యాపకాల్లో వారు ఉండిపోతున్నారు.

ఈ క్రమంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ 1997లో నటించిన, విడుదలకు నోచుకోని ‘రాధేశ్యామ్ సీతారామ్’ చిత్రం గురించి నెటిజన్లు తాజాగా ప్రస్తావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

‘రాధేశ్యామ్ సీతారామ్’ సెట్ కు సంబంధించిన వీడియోగా చెబుతున్న దీంట్లో డ్యాన్స్ చేస్తూ అదరగొట్టిన ఐశ్వర్యా రాయ్ ఎంబ్రాయిడరీ చేసిన లెహెంగా ధరించడంతో పాటు ఆభరణాలను ఓ రేంజ్ లోనే పెట్టుకుని ఉండటం కనబడుతుంది.

ఇక, ఆ వీడియోలో ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుండగా బ్యాక్ డ్రాప్ లో వినిపించే పాట మాత్రం ‘రాధేశ్యామ్ సీతారామ్’ చిత్రంలోది కాదు. గతంలో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటించిన ‘దిల్ కా రిస్తా’ చిత్రంలోని పాటను ఈ వీడియోలో మిక్స్ చేశారు.