లాక్‌డౌన్ పొడిగిస్తే రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ: గల్లా జయదేవ్

08-04-2020 Wed 18:57
  • ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న గల్లా
  • సమాజ సేవను వైసీపీ నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారు
  • 11న సీఎంలతో సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై పూర్తి స్పష్టత
Special package for states if lockdown is extended says Galla Jayadev

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను కనుక మరింత కాలం పొడిగిస్తే రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. ఈ రోజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో టీడీపీ తరపున పాల్గొన్న గల్లా అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

11న ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు సమాజ సేవను కూడా స్థానిక ఎన్నికల కోసం వాడుకుంటున్నారని జయదేవ్ ఆరోపించారు. ప్రస్తుత కష్టకాలంలో రాజకీయాలు తగవని హితవు పలికారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని ప్రధానిని కోరినట్టు గల్లా తెలిపారు.