Chandrababu: వైద్యుడు సుధాకర్ రావు సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించిన చంద్రబాబునాయుడు

Chandrababu Naidu criticises CM Jagan
  • అతని వ్యాఖ్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది
  • వైద్య సేవలు చేసే యోధులను ఈ విధంగా అగౌరవపరుస్తారా?
  • వారిపై శ్రద్ధ కనబర్చండంటూ సీఎం జగన్ కు హితవు 
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ రావును రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఆ ఆసుపత్రిలో మాస్క్ లు, గ్లోవ్స్ కొరత ఉందన్న విషయాన్ని చెప్పిన సుధాకర్ వ్యాఖ్యలపై స్పందించి, చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేయడం షాక్ కు గురిచేస్తోందని అన్నారు.

వైద్య సేవలు అందించే యోధులను ఈ విధంగా అగౌరవపరిస్తే, ఇక బాధితులను రక్షించే క్రమంలో వారిలో ఏ విధంగా జగన్ స్ఫూర్తిని నింపుతారని ప్రశ్నించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని కచ్చితంగా కాపాడుకోవాలని, వారి గురించి శ్రద్ధ కనబరచాలని సీఎం జగన్ కు హితవు పలికారు.
Chandrababu
Telugudesam
Doctor
Sudhaker Rao
Suspend

More Telugu News