ప్రభుత్వ ఆంక్షలు వైసీపీ నేతలకు వర్తించవా?: కాల్వ శ్రీనివాసులు

08-04-2020 Wed 16:53
  • ప్రభుత్వ డబ్బును వైసీపీ అభ్యర్థులు అందిస్తున్నారు
  • పోలీసులు పట్టించుకోవడం లేదు
  • ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం
Kalva Srinivasulu fires on YSRCP

లాక్ డౌన్ నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. పేదలకు కేటాయించిన రూ. 1000 నగదును వైసీపీ నేతలు పంచుతున్నారని... అయినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థులు ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నారని విమర్శించారు.

వైసీపీ నేతలు డబ్బులు ఇస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వందిలాది మంది కార్యకర్తలతో కలిసి... జాతరలా డబ్బు పంచుతున్నారని అన్నారు. ప్రజలకు వర్తిస్తున్న ఆంక్షలు వైసీపీ నేతలకు వర్తించవా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.