షారుక్ .. సల్మాన్ భారీ మల్టీస్టారర్

08-04-2020 Wed 16:47
  • హీమాన్ అనిపించుకున్న సల్మాన్
  • రొమాంటిక్ హీరోగా ముద్ర వేసిన షారుక్ 
  • మరో భారీ మల్టీ స్టారర్ కి సన్నాహాలు
Nikhil Adwani Movie

జాతీయస్థాయి హీరోలుగా సల్మాన్ .. షారుక్ లకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీమాన్ గా సల్మాన్ .. రొమాంటిక్ కింగ్ గా షారుక్ ప్రేక్షకుల హృదయాలపై బలమైన ముద్రను వేశారు. అలాంటి ఈ అగ్రహీరోల సినిమాలు ఈ మధ్య కాలంలో అంచనాలను అందుకోలేకపోయాయి. ఆయా సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా, పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దాంతో ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు కథానాయకులతో దర్శకుడు నిఖిల్  అద్వాని ఒక భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. యశ్ రాజ్  ఫిలిమ్స్ వారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో 'కరణ్ అర్జున్' సంచలన విజయాన్ని సాధించింది. మరోసారి ఇదే కాంబినేషన్లో సినిమా రానుందంటే అది అభిమానులకు పెద్ద పండగే.