చరణ్ పై దృష్టి పెట్టిన వంశీ పైడిపల్లి

08-04-2020 Wed 16:06
  • 'మహర్షి'తో దక్కిన సూపర్ హిట్ 
  • మహేశ్ తో మళ్లీ దక్కని అదృష్టం 
  •  కొత్త కథపై వంశీ పైడిపల్లి కసరత్తు
Vamshi Paidipalli Movie

'మహర్షి' వంటి బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ మహేశ్ బాబుతోనే సినిమా చేయాలని వంశీ పైడిపల్లి భావించాడు. అందుకు తగిన స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో చరణ్ మీద వంశీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' చేస్తున్న చరణ్, ఆ తరువాత సినిమాను ఏ దర్శకుడితో చేయాలనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అందువలన తన తదుపరి సినిమాను ఆయనతో సెట్ చేయాలని వంశీ పైడిపల్లి ప్రయత్నాలు చేస్తున్నాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఎవడు' వంటి సూపర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే.