రేపు ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

08-04-2020 Wed 15:44
  • రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం
  • ‘కరోనా’ సహా పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం
  • చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం
AP TDP Politbureau meeting tomorrow

రేపు ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, నిత్యావసరాల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు ధర, కూలీల ఇక్కట్లు తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్టు సమాచారం.