Hydroxychloroquine: 'రామాయణ్' ఘట్టాన్ని ఉటంకిస్తూ.. భారత్ ను క్లోరోక్విన్ పంపించాలని వేడుకున్న బ్రెజిల్!

  • హైడ్రాక్సి క్లోరోక్విన్ ను పంపించాలని ఇండియాను కోరిన బ్రెజిల్
  • లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు సంజీవని తెచ్చాడన్న బ్రెజిల్ అధ్యక్షుడు
  • మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేతులు కలుపుతామన్న మోదీ
Brazil President References Ramayana While Urging India To Release Drug

కరోనా వైరస్ కోరలు చాస్తున్న దశలో ప్రపంచ దేశాలకు భారత్ ఒక పెద్ద దిక్కులా కనిపిస్తోంది. కరోనాను నివారించే క్రమంలో హైడ్రాక్సి క్లోరోక్విన్ (మలేరియాకు ఉపయోగించే డ్రగ్) ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ డ్రగ్ మన దగ్గరే ఎక్కువ మొత్తంలో ఉండటంతో అమెరికా సహా అన్ని దేశాలు... ఈ మందును తమకు పంపించాలని కోరుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి పలుమార్లు ఫోన్ చేసి ఇదే విషయమై చర్చించారు. ఈ విషయంలో దాదాపు 30 దేశాలు మన దేశం యొక్క సాయాన్ని అర్థిస్తున్నాయి.

తాజాగా క్లోరోక్విన్ ను పరఫరా చేయించాలని బ్రెజిల్ కూడా ఇండియాను కోరింది. హైడ్రాక్సి క్లోరోక్విన్ ను ఇవ్వాలని మోదీని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో కోరారు. ఈ సందర్భంగా హిందువులు పవిత్రంగా భావించే రామాయణాన్ని ఆయన ఉటంకించారు. 'శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడిని కాపాడేందుకు హిమాలయాల నుంచి హనుమంతుడు సంజీవనిని తెచ్చినట్టు... అనారోగ్యంతో ఉన్నవారికి జీసస్ స్వస్థత చేకూర్చినట్టు... ప్రజల కోసం ఇండియా, బ్రెజిల్ కలసి కట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి' అని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు లేఖ రాశారు. అంతేకాక మోదీతో ఫోన్ లో మాట్లాడారు.

ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... బ్రెజిల్ అధ్యక్షుడితో ఫలప్రదమైన చర్చ జరిగిందని... మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేతులు కలుపుతామని చెప్పారు.

More Telugu News