సినీ కార్మికుల సంక్షేమం కోసం సీసీసీకి మరిన్ని విరాళాలు

08-04-2020 Wed 15:22
  • ప్రొడ్యూసర్ పద్మావతి గల్లా రూ.10 లక్షలు
  • సినీ నటుడు సాయికుమార్, హీరో ఆది లు రూ. 5,00,004
  • డబ్బింగ్ అసోసియేషన్ కు విరాళమిచ్చిన సాయికుమార్
Galla padmavathi and Sai kumar and others donations to CCC

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో రోజు వారీ సినీ కార్మికులను ఆదుకునే నిమిత్తం అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రొడ్యూసర్ పద్మావతి గల్లా ముందుకొచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి విరాళంగా రూ.10 లక్షలు అందజేశారు.

అదే విధంగా, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, హీరో ఆది సాయికుమార్ లు కూడా సీసీసీకి రూ. 5,00,004 విరాళంగా సమర్పించారు. డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్ కు కూడా సాయికుమార్ రూ. 1,00,008 విరాళంగా ఇచ్చారు. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, సాయి కుమార్ సోదరుడు రవి శంకర్ కూడా ఒక లక్ష రూపాయల విరాళాన్ని డబ్బింగ్ యూనియన్ కు విరాళంగా ప్రకటించారు.