Jagan: ఏపీలో ఇక 50 నిమిషాల్లోనే కరోనా టెస్టింగ్‌ రిపోర్ట్‌.. అందుబాటులోకి ర్యాపిడ్ టెస్టు కిట్లు!

  • కరోనా కట్టడిపై అధికారులతో జగన్‌ భేటీ
  • కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను పరిశీలించిన సీఎం
  • కరోనా పరీక్షల కోసం ఏపీలో 1,000 ర్యాపిడ్‌ కిట్స్‌
  • పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లోనే తయారీ 
jagan on corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఈ రోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఆళ్ల నాని, గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌తో పాటు పలువురు అధికారులతో చర్చించారు. కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను పరిశీలించారు.

కరోనా పరీక్షల కోసం ఏపీలో 1,000 ర్యాపిడ్‌ కిట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో కిట్‌తో రోజుకు 20 టెస్టులు నిర్వహించవచ్చు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లోనే వీటిని తయారు చేశారు. 50 నిమిషాల్లోనే ఒక టెస్టింగ్‌ రిపోర్ట్‌ వస్తుంది. మరో వారం రోజుల్లో 10,000  టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సర్వే చేసిన వైద్య, ఆరోగ్యశాఖ కరోనా లక్షణాలతో ఉన్న 5,000 మందిని గుర్తించింది. ఇప్పటికే వారిలో దాదాపు 2,000 మందికి పరీక్షలు అవసరమని తేల్చింది. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో మెడికల్ కిట్లు, వసతుల కొరత లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 329కి చేరింది.

More Telugu News