ఏపీలో ప్రమాద ఘంటికలు... యువతపై కరోనా పంజా!

08-04-2020 Wed 12:48
  • ఏపీలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
  • 329కి చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య
  • 21 నుంచి 40 మధ్య వయసు వారే అధికం
Corona virus impact is more on youth in Andhra Pradesh

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరింది. కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. 74 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. 49 కేసులతో నెల్లూరు, 41 కేసులతో గుంటూరు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఈ మహమ్మారి బారిన పడిన వారిలో అత్యధికులు 40 ఏళ్ల కంటే తక్కువ వయసువారే కావడం ఆందోళన కలిగిస్తోంది.

వయసును బట్టి బాధితుల సంఖ్య ఇదే:
0-20 ఏజ్ గ్రూప్ - 8 శాతం
21-40 ఏజ్ గ్రూప్ - 48 శాతం
41-60 ఏజ్ గ్రూప్ - 36 శాతం
60 కంటే ఎక్కువ వయసు - 8 శాతం.