బన్నీ కెరియర్లోనే మొదటిసారి .. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న 'పుష్ప'

08-04-2020 Wed 12:19
  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
  • చిత్తూరు యాస మాట్లాడే బన్నీ 
  • సుకుమార్ టేకింగ్ పై ఆసక్తి
Pushpa Movie

ఈ రోజున అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రమైన 'పుష్ప' నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్పక్ నారాయణ్ గా ఆయన పాత్రను పరిచయం చేస్తూ వదిలిన ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన లభించింది. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ముఠాకి చెందిన వ్యక్తిగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. బన్నీ కెరియర్లో ఒకేసారి ఐదు భాషల్లో విడుదలకానున్న తొలి సినిమా ఇదే. అలాగే అడవి నేపథ్యంలో .. చిత్తూరు యాసలో మాట్లాడే మాస్ యువకుడిగా ఆయన ఈ రోల్ చేయడం కూడా ఇదే మొదటిసారి. ఆయన పాత్రను సుకుమార్ తీర్చిదిద్దిన తీరుపైనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక కనిపించనున్న సంగతి తెలిసిందే.