పవన్‌ కల్యాణ్‌ పెద్ద కుమారుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

08-04-2020 Wed 12:14
  • అకిరకు చిరు బర్త్‌ డే విషెస్
  • మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటామని వ్యాఖ్య
  • నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6'4)
  • అఖిల్‌కి కూడా చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు
Chiranjeevi Posts on Instagram

పవన్‌ కల్యాణ్‌ పెద్ద కుమారుడు అకిరా నందన్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అతడికి శుభాకాంక్షలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకిరతో అతడి బాల్యంలో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో అకిరను చిరంజీవి ఎత్తుకుని కనపడుతున్నారు. అలాగే, అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా అతడితో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేసిన చిరంజీవి.. అక్కినేని వారసుడికి కూడా శుభాకాంక్షలు తెలిపి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
                      
'మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6'4"). అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి. నీకు పవర్‌ ఫుల్‌ ఫ్యూచర్‌ ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌ డే అకిర' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
 
సినీనటుడు అక్కినేని నాగార్జున కుమారుడు, టాలీవుడ్ హీరో అఖిల్ కూడా నేడు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నాడు. ఆయనకు కూడా చిరు శుభాకాంక్షలు తెలిపారు. 'హాపీ బర్డ్‌ డే అఖిల్‌.. ఆయన చరణ్‌కి ఒక తమ్ముడు.. నాకు, సురేఖకి కొడుకు లాంటి వాడు. మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్ అండ్‌ మోస్ట్‌ లవ్డ్ కిడ్. మంచి భవిష్యత్తు వుండాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.

అఖిల్‌తో అతడి చిన్నప్పుడు దిగిన ఫొటోను చిరు పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోలో నాగార్జున కూడా ఉన్నారు. కాగా, అకిర, అఖిల్‌కు టాలీవుడ్‌ ప్రముఖులు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అకిర గురించి చిరు చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.