పవన్ సినిమాలోను కనిపించనున్న చరణ్?

08-04-2020 Wed 11:34
  • చరణ్ కి విపరీతమైన క్రేజ్ 
  • 'ఆచార్య' సినిమాలో ప్రత్యేక పాత్ర
  • క్రిష్ ప్రాజెక్టులోను వినిపిస్తున్న పేరు 
Krish Movie

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. కథానాయకుడిలో స్ఫూర్తిని నింపే పాత్ర అని అంటున్నారు. దాంతో మెగా అభిమానులంతా ఈ ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు.

ఇక పవన్ సినిమాలోను చరణ్ కనిపించనున్నాడనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్, ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక చారిత్రక చిత్రం చేయనున్నాడు. ఆంగ్లేయుల పాలనా కాలం నాటి వాతావరణంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో చరణ్ కూడా కనిపించే అవకాశం ఉందనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఆయన పాత్ర ఎలా ఉండనుంది? ఆయన ఎలా కనిపించనున్నాడు? అనేది ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.