లాక్ డౌన్ ను ఉల్లంఘించిన వారికి చుక్కలు చూపిస్తున్న పోలీస్ డ్రోన్లు.. వీడియో ఇదిగో!

08-04-2020 Wed 11:33
  • ఇష్టానుసారం బయట తిరుగుతున్న జనాలు
  • డ్రోన్లతో ట్రేస్ చేస్తున్న కేరళ పోలీసులు
  • డ్రోన్లను చూసి పరుగులు పెడుతున్న జనాలు
Lockdown violators run like bullets after tracing Keral police drones

కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని... బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలన్న హెచ్చరికలను పలువురు పట్టించుకోవడం లేదు. ఏమీ పట్టనట్టు ఇష్టానుసారం బయట తిరుగుతున్నారు. సామాజిక దూరాన్ని కూడా పాటించడం లేదు. వీళ్లకు చెక్ పెట్టేందుకు కేరళ పోలీసులు సరికొత్త ఆయుధాన్ని ప్రయోగించారు. డ్రోన్లతో లాక్ డౌన్ ను ఉల్లంఘించిన వారిని గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి కేరళ పోలీసులు ట్విట్టర్లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్లను చూసి జనాలు పరుగులు పెడుతుంటే... బ్యాక్ గ్రౌండ్ లో క్రికెట్ కామెంటరీని యాడ్ చేశారు. బుల్లెట్ లాగా దూసుకుపోతున్నారంటూ రవిశాస్త్రి చెప్పిన కామెంటరీ ఈ వీడియోకు మరింత కామెడీని జోడించింది. వీడియో చూడండి.