గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధమైన లావణ్య త్రిపాఠి

08-04-2020 Wed 10:57
  • ఆరంభంలో వరుస విజయాలు
  • గ్లామరస్ పాత్రల విషయంలో నిరాశ 
  • నిర్ణయాన్ని మార్చుకున్న లావణ్య
Lavanya Tripathi

తెలుగు తెరకి 'అందాల రాక్షసి' సినిమాతో పరిచయమైన లావణ్య త్రిపాఠి, ఆ తరువాత 'భలే భలే మగాడివోయ్' .. 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి భారీ విజయాలను సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత సినిమాలు చేస్తూ వెళుతోందిగానీ, ఆశించిన స్థాయిలో క్రేజ్ రావడం లేదు. అందుకు కారణం తనకి సరైన గ్లామరస్ పాత్రలు పడకపోవడమేనని ఆమె గ్రహించి, ఆ తరహా పాత్రలను ఇవ్వమని కూడా కోరింది. కానీ ఆమె ముచ్చట మాత్రం తీరలేదు.

దాంతో ఆమె తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసిందనే టాక్ వినిపిస్తోంది. గ్లామరస్ గా కనిపించడానికి తను సిద్దమనే సంకేతాలను ఆమె బలంగా పంపించడం వల్లనే, పవన్ - హరీశ్ శంకర్ సినిమాలోను .. మారుతి - నాని సినిమాలోను అవకాశాలు వచ్చాయని అంటున్నారు. ఇక 'బంగార్రాజు'  సినిమాలోను అవకాశం దక్కడానికి అదే కారణమని చెబుతున్నారు. లావణ్య ఏ స్థాయిలో గ్లామర్ డోస్ పెంచుతుందో చూడాలి మరి.