ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 15!

08-04-2020 Wed 10:32
  • నెల్లూరు, కృష్ణా జిల్లాలలో ఆరేసి కేసులు
  • చిత్తూరు జిల్లాలో 3 కేసులు
  • మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 329
15 New Cases of Corona In Andhra Pradesh

మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకూ ఆంధ్రప్రదేశ్ లో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. "రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో, కొత్తగా నెల్లూరు జిల్లాలో 6,  కృష్ణా జిల్లాలో 6, చిత్తూరులో 3 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 329 కి పెరిగింది" అని పేర్కొంది.