'విక్రమ్ వేద' తెలుగు రీమేక్ .. విజయ్ సేతుపతి పాత్రలో పవన్?

08-04-2020 Wed 10:28
  • సెట్స్ పై 'వకీల్ సాబ్'
  • లైన్లో క్రిష్ - హరీశ్ శంకర్ 
  • మరో ప్రాజెక్టుగా తమిళ రీమేక్
Vikram Vedha Movie Remake

పవన్ కల్యాణ్ వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నాడు. ఆల్రెడీ 'వకీల్ సాబ్' సెట్స్ పై ఉండగా, మరో రెండు ప్రాజెక్టులు ఆ దిశగా పనులు జరుపుకుంటున్నాయి. మరో ప్రాజెక్టు కోసం ఆయనను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన 'విక్రమ్ వేద' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ సేతుపతి - మాధవన్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

ఆ సినిమా తెలుగు రైట్స్ ను రామ్ తాళ్లూరి దక్కించుకున్నారు. విజయ్ సేతుపతి పాత్రకిగాను పవన్ ను ఒప్పించడానికి ఆయన  ప్రయత్నిస్తున్నాడట. పవన్ ఓకే అంటే మరో పాత్రకిగాను రవితేజను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరికి .. పవన్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో, పవన్ అంగీకరించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. హిందీలోను ఈ సినిమా రీమేక్ అవుతుండటం విశేషం.