కరోనా సహాయక చర్యలకు.. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్‌డోర్సీ రూ.వంద కోట్ల డాలర్ల విరాళం

08-04-2020 Wed 09:51
  • అతని సంపదలో ఇది 28 శాతం
  • డిజిటల్‌ పేమెంట్‌ గ్రూప్‌ నుంచి బదిలీ
  • తన నిర్ణయం మరింత మందికి ప్రేరణ ఇస్తుందని ట్వీట్‌
 Jack Dorsey Pledges 1 Billion dollars To COVID19 Relief Fund

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా విపత్తును సమష్టిగా ఎదుర్కోవాల్సిన ఈ సమయంలో వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యల నేపధ్యంలో తన సామాజిక బాధ్యతగా వంద కోట్ల డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

 డిజిటల్‌ పేమెంట్‌ గ్రూప్‌లో ఉన్న తన వాటా నుంచి ఈ మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. జాక్‌ డోర్సీ సంపదలో ఈ మొత్తం 28 శాతం వరకు ఉంటుందని అంచనా. ‘మన జీవిత కాలం చాలా చిన్నది. ఈ అతి తక్కువ కాలంలో ప్రజోపయోగానికి ఉపయుక్తమయ్యే పనుల్ని ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉందన్నది నా భావన. ఈ నా నిర్ణయం మరింత మందికి ప్రేరణ ఇస్తుందని భావిస్తున్నాను’ అంటూ ఈ సందర్భంగా జాక్‌ డోర్సీ ట్వీట్‌ చేశారు.