'పుష్ప' ఫస్టులుక్ వచ్చేసింది.. పక్కా మాస్ లుక్ తో అల్లు అర్జున్!

08-04-2020 Wed 09:40
  • అడవి నేపథ్యంలో సాగే కథ 
  • పుష్పక్ నారాయణ్ పాత్రలో బన్నీ
  • కథానాయికగా రష్మిక
Sukumar Movie

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. శేషాచల అడవుల నుంచి సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. మాసిన గెడ్డం, మీసాలు .. విభిన్నమైన హెయిర్ స్టైల్ .. దుమ్ము పట్టేసిన షర్టుతో తీక్షణంగా చూస్తూ పక్కా మాస్ లుక్ తో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు 'పుష్పక్ నారాయణ్'. ఆయన పేరులోని 'పుష్ప'ను టైటిల్ గా సెట్ చేశారన్న మాట. అల్లు అర్జున్ పాత్ర పేరుకి .. ఆయన లుక్ కి మధ్య చాలా వైవిధ్యం వుంది. అదేమిటనే విషయంపైనే సుకుమార్ కథ నడిపిస్తాడని అర్థమవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా రష్మిక కనిపించనుంది. అడవి నేపథ్యంలో సాగే ఈ కథ, అభిమానులకు ఎలాంటి విశేషాలను అందిస్తూ వెళుతుందో చూడాలి.
.