సరిహద్దు సైనికుల కష్టాలు చూడని వారు ఈ దృశ్యాలు చూడండి: ఫొటోలు పోస్ట్ చేసిన హరీశ్ రావు

08-04-2020 Wed 06:30
  • లాక్ డౌన్ అమలు కోసం పోలీసుల శ్రమ
  • నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు
  • యావత్ దేశానికే తెలంగాణ పోలీసులు ఆదర్శమన్న హరీశ్ రావు
Harish Rao Tweets Police Problums in Lockdown

లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని, నిద్రాహారాలు మాని, వేళకు తిండి లేకుండా, అవస్థలు పడుతూ కూడా, విధి నిర్వహణలో అలక్ష్యం చూపడం లేదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. "సరిహద్దుల్లో సైనికులు మనకోసం ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో చూడనివాళ్లు ఈ దృశ్యాలు చూస్తే చాలు. విధి నిర్వహణలో మన తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి త్యాగాలకు మనం ఇవ్వగలిగిన గౌరవం, ఇంటిపట్టునే ఉండి లాక్ డౌన్ ను విజయవంతం చేయడం. వారికి నా శాల్యూట్" అని వ్యాఖ్యానించారు. ఇక ఈ ట్వీట్ పై రాష్ట్ర డీజీపీ మహీందర్ రెడ్డి కూడా స్పందించి, తమ పోలీసుల కష్టాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.