అల్లు అర్జున్ సినిమా టైటిల్ లీక్... ఆగ్రహంతో ఉన్న నిర్మాతలు!

08-04-2020 Wed 06:19
  • నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు
  • ఉదయం 9 గంటలకు విడుదల కావాల్సిన అప్ డేట్
  • సినిమా పేరు 'పుష్ప' అంటూ సోషల్ మీడియాలో లీక్
Allu Arjun New Movie Tittle Leak

నేడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా, ఉదయం 9 గంటలకు, సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం అప్ డేట్ ను ప్రకటిస్తామని నిన్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, ముందే ఈ అప్ డేట్ లీక్ అయిపోయింది. ఈ సినిమాలో బన్నీ పాత్ర పేరు 'పుష్పక్ నారాయణ్' అని, ఆ పేరులోని 'పుష్ప' అన్న పేరును చిత్రానికి పెట్టారని వార్తలు రావడంతో, చిత్ర యూనిట్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ ను థ్రిల్ చేయాలని తాము భావిస్తే, ఇలా లీక్ కావడాన్ని భరించలేకున్న నిర్మాతలు, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం వుందని సమాచారం. ఏది ఏమైనా, ఈ ఉదయం 9 గంటలకు అఫీషియల్ గా సినిమా పేరు బహిర్గతం కానుంది.