ఏపీలో 314కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

07-04-2020 Tue 22:13
  • ఇవాళ కొత్తగా 10 కేసులు
  • గుంటూరు జిల్లాలో 8 మందికి కరోనా నిర్ధారణ
  • ఏపీలో మరణాలు 4
AP witnesses ten more corona positive cases

ఏపీలో కరోనా (కొవిడ్-19) పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఈ సాయంత్రం వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 314కి చేరింది. తాజాగా, గుంటూరు జిల్లాలో 8 కేసులు తేలగా, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా లెక్కకు మిక్కిలిగా కరోనా కేసులు బయటపడుతుండడంతో ఉక్కిరిబిక్కిరైన ఏపీ ప్రభుత్వానికి ఇవాళ్టి కేసుల సంఖ్య (10) ఊరటనిచ్చే పరిణామం అని చెప్పాలి. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో నలుగురు మరణించారు.