RBI: మారటోరియం నిబంధన అందరికీ వర్తింపజేయాలి: ఆర్బీఐ తాజా ఆదేశాలు

RBI clarifies over moratorium to all Banks and NBFCs
  • ఇటీవల మూడు నెలల పాటు మారటోరియం విధించిన ఆర్బీఐ
  • డిఫాల్ట్ గా అందరికీ వర్తింపజేయాలని తాజా సూచన
  • ఈమెయిల్ ద్వారా అన్ని బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు సందేశం
లాక్ డౌన్ నేపథ్యంలో రుణగ్రహీతలు మూడు నెలల పాటు ఈఎంఐలు చెల్లించనవసరం లేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వెసులుబాటును ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు  రుణగ్రహీతలు కోరితేనే అమలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజాగా, మారటోరియం సదుపాయాన్ని తప్పనిసరిగా అందరు రుణగ్రహీతలకు వర్తింపజేయాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఓ రుణగ్రహీత తనకు ఈ సౌకర్యం అక్కర్లేదని చెబితేనే అతడ్ని మారటోరియం పరిధి నుంచి తప్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎవరైనా ప్రత్యేకంగా కోరితే తప్ప దీన్ని డిఫాల్ట్ గా అందరు రుణగ్రహీతలకు వర్తింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు ఈమెయిల్ ద్వారా స్పష్టం చేసింది.
RBI
Moratorium
Loans
EMI
Corona Virus
Lockdown

More Telugu News