తెలంగాణలో ‘కరోనా’ కట్టడికి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విరాళం

07-04-2020 Tue 20:00
  • ఎంపీ ఫండ్స్ నుంచి కోటి రూపాయలు
  • సుజనా ఫౌండేషన్ నుంచి రూ.50 లక్షలు
  • ఈ విషయాన్ని తెలియజేస్తూ సుజనా ట్వీట్
BJP MP Sujana chowdary big donation to Telangana state

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విరాళం అందజేశారు. ఎంపీ ఫండ్స్ నుంచి రూ.కోటి, సుజనా ఫౌండేషన్ నుంచి రూ.50 లక్షల విలువ చేసే చెక్కులను విరాళం కింద మంత్రి కేటీఆర్ కు అందజేసినట్టు సుజనా చౌదరి ఓ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ముంబై ఐఐటి అలూమిని, తెలంగాణ కో ఆపరేటివ్ వీవర్స్ అసోసియేషన్ సహకారంతో 10 లక్షల విలువ గల ఫేస్ మాస్కులను ఫౌండేషన్ ద్వారా సరఫరా చేస్తామని సుజనా తెలిపారు.