Eetala Rajender: గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆసుపత్రిని సిద్ధం చేశాం: మంత్రి ఈటల రాజేందర్

  • గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 1500 పడకల ‘కోవిడ్’ ఆసుపత్రి 
  • ఆసుపత్రిని పరిశీలించిన  ఈటల, కేటీఆర్, వైద్యాధికారులు
  • ‘కరోనా’ కట్టడికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్న ఈటల
Minister Eetala Rajender says  Kovid hospital in Gachi bowli is ready

తెలంగాణలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్, గచ్చిబౌలిలో 1500 పడకల ‘కోవిడ్’ ఆసుపత్రిని సిద్ధం చేసింది. ఈ విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని మంత్రి కేటీఆర్, ఈటల, వైద్యాధికారులు కలసి ఈ రోజు సందర్శించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, మరో 22 వైద్యకళాశాలల ఆసుపత్రులను కూడా కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చామని చెప్పారు. ‘కరోనా’ కట్టడికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. అనంతరం, మొయినాబాద్ లోని భాస్కర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిని సందర్శించేందుకు వారు వెళ్లారు. ఆ ఆసుపత్రిలోని అన్ని వార్డులను తనిఖీ చేశారు.

More Telugu News