Shashi Tharoor: ట్రంప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శశి థరూర్

  • క్లోరోక్విన్ మాత్రలు పంపకపోతే చర్యలుంటాయన్న ట్రంప్
  • ఇలాంటి నేతను ఎప్పుడూ చూడలేదన్న థరూర్
  • భారత్ అమ్మదలుచుకుంటేనే సరఫరా అవుతాయని ఉద్ఘాటన
Congress leader Shashi Tharoor fires on US President Donald Trump

కరోనా చికిత్సలో మంచి పనితీరు కనబరుస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను భారత్ తమకు సరఫరా చేయకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరించడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు.

"ఓ దేశాధినేత మరో దేశాన్ని ఇలా బహిరంగంగా బెదిరించడం  ఎప్పుడూ చూడలేదు. అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయ వ్యవహారాలను పరిశీలిస్తున్నాను. ఎవరూ ఇంతటి దుందుడుకుతనంతో వ్యవహరించలేదు. మిస్టర్ ప్రెసిడెంట్... హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేయాలని గట్టిగా అడుగుతున్నారు, కానీ భారత్ అమ్మదలుచుకుంటేనే అవి మీకు సరఫరా అవుతాయన్న విషయం గమనించాలి" అంటూ మండిపడ్డారు.

More Telugu News