నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో అదితీరావు?

07-04-2020 Tue 16:51
  • ఇంద్రగంటితో నాని మూడో సినిమా
  • 'సమ్మోహనం'తో హిట్ కొట్టిన సుధీర్ బాబు 
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
Adithi Rao plays negative role in Indraganti Movie

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని - సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా 'వి' సినిమా రూపొందింది. అదితీరావు హైదరీ - నివేద థామస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా, నాని సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడు. ఈ అంశమే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ నేపథ్యంలో అదితీరావు పాత్ర కూడా నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందనీ, ఆ పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. ఇంద్రగంటి - నాని కాంబినేషన్లో వచ్చిన 'అష్టా చమ్మా' .. 'జెంటిల్ మేన్' భారీ విజయాలను అందుకున్నాయి. ఇంద్రగంటి - సుధీర్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'సమ్మోహనం' కూడా హిట్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.