జోగులాంబ గద్వాల జిల్లాలో తాజాగా 9 పాజిటివ్ కేసులు

07-04-2020 Tue 16:10
  • బాధితులంతా మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వారే
  • గద్వాల టౌన్ లో 7..రాజోలు మండల కేంద్రంలో 2 కేసులు నమోదు
  • ఈ జిల్లాలో మొత్తం 22 పాజిటివ్ కేసులు
9 positive cases registered in Jogulamba Gadwala district

ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వారి ద్వారా సంక్రమిస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో పెరుగుతోంది. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. వీళ్లందరూ మర్కజ్ వెళ్లొచ్చిన వారే. గద్వాల టౌన్ లో 7, రాజోలు మండల కేంద్రంలో మరో 2 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఈ జిల్లాలో మొత్తం 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సంబంధిత అధికారుల సమాచారం.