ఖమ్మంలో తొలి కేసు నమోదు.. మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వ్యక్తికి ‘కరోనా’

07-04-2020 Tue 15:56
  • జిల్లాలోని పెద్ద తండాకు చెందిన వ్యక్తికి ’కరోనా‘
  • సంబంధిత లక్షణాలు కనబడకపోయినప్పటికీ వైరస్ ఎటాక్
  • ఈ విషయాన్ని తెలియజేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
corona virus first case registered in Khammam

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కూడా కరోనా వైరస్ కేసు నమోదు అయింది.  జిల్లాలోని పెద్ద తండాలో ఓ వ్యక్తికి ‘కరోనా’ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సదరు వ్యక్తి ఇటీవలే ఢిల్లీలోని మర్కజ్ సమావేశాలకు హాజరై వచ్చాడని చెప్పారు.

అయితే, ‘కరోనా’ సంబంధిత లక్షణాలు అతనిలో కనబడకపోయినప్పటికీ ఈ వైరస్ బారిన పడ్డాడని, సదరు వ్యక్తి ఇప్పటికే టీబీ పేషెంట్ అని చెప్పారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారని అన్నారు. కాగా, నిన్న హెల్త్ బులెటిన్ విడుదల కావడానికి ముందు వరకూ ఆ జిల్లా నుంచి ‘కరోనా’ కేసులు నమోదు కాలేదు. ఖమ్మం ఈ మహమ్మారి బారిన పడలేదనుకుంటున్న తరుణంలో ఈ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.