సూర్య కూడా అదే నిర్ణయం .. 'అరువా' షూటింగ్ వాయిదా

07-04-2020 Tue 15:49
  • హరి దర్శకత్వంలో మరోసారి సూర్య
  • లాక్ డౌన్ కారణంగా ఆటంకం 
  • అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
Aruva Movie

హరి దర్శకత్వంలో సూర్య వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ సినిమాల్లో చాలా వరకూ హిట్ కావడంతో, ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి 'అరువా' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జూన్ నుంచి మొదలుపెట్టాలని భావించారు. అయితే లాక్ డౌన్ కారణంగా రెగ్యులర్ షూటింగును వాయిదా వేసుకున్నారు.

ఆర్టిస్టుల డేట్స్ సర్దుబాటు చూసుకుని అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇంతవరకు సూర్యతో హరి యాక్షన్ సినిమాలనే చేస్తూ వచ్చాడు. ఈ సినిమాను మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆయన ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇమ్మాన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.