బాలీవుడ్ లో కలకలం... నటి జోయాకు కూడా కరోనా పాజిటివ్

07-04-2020 Tue 15:13
  • కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోయా మోరానీ
  • నిన్ననే ఆమె అక్క షాజాకు పాజిటివ్ అని నిర్ధారణ
  • కరీమ్ మోరానీ దంపతుల రిపోర్టులు రావాల్సి ఉంది
Karim Moranis Other Daughter Zoa Morani Also Tests Positive for corona

బాలీవుడ్ నిర్మాత కరీమ్ మోరానీ రెండో కూతురు, నటి జోయా మోరానీకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆమె అక్క షాజా మోరానీకి కూడా పాజిటివ్ అని నిన్ననే నిర్ధారణ అయింది. మార్చి మధ్యలో జోయా రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చింది. నిన్ననే తన అక్కతో పాటు జోయా కూడా టెస్ట్ చేయించుకుంది. అయితే ఆమె రిపోర్టులు కొంచెం ఆలస్యంగా వచ్చాయి. ఈ పరీక్షలో జోయాకు పాజిటివ్ అని తేలింది.

జోయా మోరానీ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమె అక్క ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వీరి తల్లిదండ్రులు (కరీమ్ మోరానీ దంపతులు) కూడా టెస్టులు చేయించుకున్నారు. అయితే, వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్'ను కరీమ్ మోరానీ నిర్మించారు.