కరోనాపై పోరాటానికి టీటీడీ భారీ విరాళం!

07-04-2020 Tue 12:38
  • రూ. 19 కోట్ల విరాళాన్ని ప్రకటించిన టీటీడీ
  • ఇందులో చిత్తూరు జిల్లాకు రూ. 8 కోట్ల సాయం
  • ప్రతిరోజు 20 లక్షల మందికి ఆహార పంపిణీ
TTD donates 11 crores for fight against corona

ఏపీలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆదుకోవడానికి పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరాళాలను అందించారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ముందుకొచ్చింది. కరోనాపై పోరాటానికి  రూ. 19 కోట్ల విరాళం అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లాకు రూ. 8 కోట్ల సాయాన్ని అందిస్తున్నామని... మిగిలిన రూ. 11 కోట్లను ఏపీ ప్రభుత్వానికి అందిస్తామని తెలిపింది.

దీంతో పాటు ప్రతి రోజు 20 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ వెల్లడించారు. ఉదయం నుంచి రాత్రి వరకు 20 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు ఆహారాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి అన్ని కైంకర్యాలు జరుగుతున్నాయని తెలిపారు.