వర్మ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు: హీరోయిన్ స్వాతి

07-04-2020 Tue 12:29
  • వర్మతో సినిమా చేశాను 
  • నన్ను చూస్తే రేవతి గుర్తొస్తుందన్నారు 
  • తనని మెచ్చుకున్నారన్న స్వాతి
Swathi

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా స్వాతికి మంచి క్రేజ్ వుంది. మొదటి నుంచి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చిన స్వాతి, కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తోంది. వర్మ దర్శకత్వంలో 'కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు' సినిమాలోను ఆమె నటించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె వర్మ గురించి ప్రస్తావించింది.

"వర్మ దర్శకత్వంలో నేను ఈ సినిమా చేసిన తరువాత, ఆయన గురించి అంతా నన్ను అడగడం మొదలుపెట్టారు. ఆయన అలా అట గదా .. ఇలా అటగదా అంటూ మొహమాటం లేకుండా అడిగేవారు. కానీ వర్మ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అవసరానికి మించి నాతో ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 'స్వాతి నువ్ చాలా టాలెంటెడ్ .. నిన్ను చూస్తుంటే నాకు రేవతి గుర్తొస్తుంది. కాకపోతే మీ ఇద్దరూ కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు .. అలా కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లిపో' అనేవారని చెప్పుకొచ్చింది.