కొత్త కెరీర్ ప్రారంభించబోతున్న గోవా బ్యూటీ!

07-04-2020 Tue 12:17
  • స్పోర్ట్స్ యాంకర్ గా మారనున్న ఇలియానా
  • ఓ స్పోర్ట్స్ ఛానల్ తో ఇప్పటికే చర్చలు
  • ఇల్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఛానల్ యాజమాన్యం
Ileana to start new career as sports anchor

టాలీవుడ్ లో 'దేవదాస్' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా... అనతి కాలంలోనే అగ్రనటిగా ఎదిగింది. దక్షిణాదిలో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్లో అగ్ర నటులందరి సరనన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో... అక్కడ కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే, ఇటీవలి కాలంలో సినీ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో, కొత్త కెరీర్ ను ప్రారంభించేందుకు ఇల్లీ రెడీ అవుతోంది.

యాంకర్ గా మారేందుకు ఇలియానా యత్నిస్తోంది. యాంకర్ అంటే బుల్లితెర షోలలో యాంకర్ కాదు. స్పోర్ట్ ఛానల్ లో యాంకర్ గా మారేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఇప్పటికే ఓ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. సదరు యజమాన్యం కూడా ఇల్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇలియానా రవితేజ సరసన ఒక చిత్రం, బాలీవుడ్ లో మరో సినిమా చేస్తోంది. ఇవి పూర్తైన తర్వాత పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ యాంకర్ గా మారుతుందట.