కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం: ఎమ్మెల్యే రోజా

07-04-2020 Tue 11:37
  • ఈ సంగ్రామంలో మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్స్ 
  • గుమ్మం లోపలే ఉందాం
  • మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం 
mla roja on coronavirus

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ట్వీట్లు చేశారు. 'కంటికి కనిపించని శత్రువు (కరోనా)తో యుద్ధం చేస్తున్నాం. ఈ సంగ్రామంలో మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్స్ మాత్రమే. గుమ్మం లోపలే ఉందాం.. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం. ఇంటి వద్దనే ఉండండి' అని రోజా ట్వీట్ చేశారు.
 
'మన ప్రాణాలను కాపాడేందుకు కుటుంబాన్ని సైతం వదిలి సేవలందిస్తున్న డాక్టర్ దేవుళ్లకు సెల్యూట్. ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు' అని ఆమె మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరుకున్న విషయం తెలిసిందే.