బన్నీ .. సుకుమార్ పరిశీలిస్తున్న ఇంట్రెస్టింగ్ టైటిల్

07-04-2020 Tue 11:31
  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయిక పాత్ర పేరు 'పుష్ప'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ     
Pushpa Movie

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. కేరళ అడవుల్లో చిన్నపాటి షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా షూటింగు వాయిదా పడింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితం కానుంది. కథ అంతా కూడా శేషాచలం అడవుల నేపథ్యంలో సాగుతుంది. అందువలన 'శేషాచల' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే, తాజా వార్తల ప్రకారం.. ఈ సినిమా టైటిల్ హీరోయిన్ వైపు నుంచి ఉంటుందనీ, అందుకే 'పుష్ప' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు 'పుష్ప' అని తెలుస్తోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.