ఏపీలో 15 గంటల వ్యవధిలో ఒకేఒక కరోనా పాజిటివ్!

07-04-2020 Tue 11:23
  • మొత్తం కేసుల సంఖ్య 304
  • కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి మరణం
  • గుంటూరు జిల్లాలో ఓ పాజిటివ్ కేసు
Only One Positive Corona in Last 15 Hours in AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన ఆరోగ్య శాఖ, కొత్తగా ఒక కేసు మాత్రమే నమోదైందని తెలిపింది. "రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్తగా గుంటూరులో ఒక కేసు నమోదయింది. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 304 కి పెరిగింది. కర్నూలు జిల్లాలో కొవిడ్-19 కారణంగా ఒక మరణం నిర్ధారించబడింది" అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఏపీలో మర్కజ్ కాంటాక్టులను నియంత్రించడంలో విజయం సాధిస్తే, క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.