కొత్త దర్శకుడితో ఆనంద్ దేవరకొండ!

07-04-2020 Tue 10:04
  • 'దొరసాని' సినిమాతో మంచి పేరు 
  • సెట్స్ పైకి వెళ్లిన రెండో సినిమా 
  • ఛాలెంజింగ్ పాత్ర అంటున్న హీరో
Damodara Movie

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా ఆ మధ్య 'దొరసాని' వచ్చిన సంగతి తెలిసిందే. కథాకథనాల పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, రెండవ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందువరకూ ఈ సినిమా సెట్స్ పైనే వుంది. ఆ సినిమా షూటింగు దశలో ఉండగానే, తాజాగా ఆనంద్ దేవరకొండ మరో సినిమాను అంగీకరించాడు.

దామోదర అట్టాడ అనే నూతన దర్శకుడు వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో, ఆనంద్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. విజయ్ మట్టపల్లి .. ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కథానాయికతో పాటు ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ సినిమాలో తన పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుందనీ, తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందనే నమ్మకంతో ఆనంద్ దేవరకొండ వున్నాడు.