ఈ ఉదయం 9 గంటల వరకు ఇండియాలో కరోనా అప్ డేట్స్ వివరాలు!

07-04-2020 Tue 09:57
  • 4,421కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
  • మరణాల సంఖ్య 114
  • గత 24 గంటల్లో కొత్తగా 354 కేసులు
Corona updates of India

భారత్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. ఈ ఉదయం 9 గంటల వరకు మన దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,421కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,981గా ఉంది. మరణాల సంఖ్య 114కు పెరిగింది. 325 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 354 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఐదుగురు మృతి చెందారు.

ముంబైలో మరో 26 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లో కూడా వైరస్ తీవ్రత పెరుగుతోంది.