టబు అదరగొట్టేసిన పాత్రలో రమ్యకృష్ణ?

07-04-2020 Tue 09:42
  • హిందీలో హిట్ కొట్టిన 'అంధదూన్'
  • టబు పాత్రకి గాను వినిపించిన అనసూయ పేరు 
  • తాజాగా తెరపైకి రమ్యకృష్ణ
Andhadhun Movie Remake

ఆ మధ్య హిందీలో వచ్చిన 'అంధదూన్' వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. టబు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను నితిన్ సొంతం చేసుకున్నాడు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే సంప్రదించారు. అయితే పారితోషికం ఎక్కువగా అడిగిందనే ఉద్దేశంతో, ఆ ఆలోచనను విరమించుకున్నారనే వార్తలు వచ్చాయి.

ఆ పాత్రకి అనసూయ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో చర్చలు జరుపుతున్నటుగా ప్రచారం జరిగింది. తాజాగా రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. కథలో అత్యంత కీలకమైన పాత్ర అదే కావడంతో, ఆ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందని భావించి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే హిందీలో టబు చేసిన పాత్ర కాస్త బోల్డ్ గా .. నెగెటివ్ షేడ్స్ తో ఉంటుంది. ఆ పాత్ర చేయడానికి రమ్యకృష్ణ ఒప్పుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.