ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో మోహన్ లాల్!

07-04-2020 Tue 08:58
  • 75 శాతం చిత్రీకరణ పూర్తిచేసిన 'ఆర్ ఆర్ ఆర్'
  •  కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీఆర్ 
  • స్ఫూర్తిని నింపే పాత్రలో మోహన్ లాల్
RRR Movie

ఎన్టీఆర్ .. చరణ్ ప్రధాన పాత్రధారులుగా 'రౌద్రం రణం రుధిరం' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఆయా భాషలకి చెందిన నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అలా ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

అయితే ఆయన పాత్ర ఎలా వుండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఆయన కొమరమ్ భీమ్ కి బాబాయ్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. కొమరమ్ భీమ్ జీవితంలో ఆయన బాబాయ్ స్థానం ప్రత్యేకం. కొమరమ్ భీమ్ పోరాట పటిమను .. ఉద్యమ స్ఫూర్తిని నింపినదే ఆయన బాబాయ్. ఆ పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నాడని అంటున్నారు. పవర్ ఫుల్ గా కనిపించే ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.