కరీంనగర్ లో ‘కరోనా’ వ్యాప్తికి కారకులైన ఇండోనేషియన్లపై కేసుల నమోదు

06-04-2020 Mon 22:03
  • గత నెల 14న కరీంనగర్ వెళ్లిన ఇండోనేషియన్లు
  • ఆ జిల్లాల్లో ‘కరోనా’ వ్యాప్తికి కారకులైన ఘటనపై దర్యాప్తు
  • పది మంది ఇండోనేషియన్లు సహా మరో ఐదుగురిపై కేసులు నమోదు
Police case filed against Indonesians who prevailes corona virus in Karimnagar

గత నెల 14న కరీంనగర్ కు వెళ్లిన ఇండోనేషియన్ల వల్ల ఆ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పది మంది ఇండోనేషియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు కరీంనగర్ వన్ టౌన్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు.

ఈ విషయమై కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి  ఫిర్యాదు చేశారని, ఈ మేరకు తాము దర్యాప్తు చేసినట్టు చెప్పారు. ‘కరోనా’ వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధంగా వ్యవహరించి మతపరమైన సమావేశాల్లో పాల్గొన్నారని, వీరి నిర్లక్ష్యంతో ఇతరులకు కూడా ఈ వైరస్ సోకిందని తెలిపారు.